ట్రెండింగ్
Epaper    English    தமிழ்

U19 WC ఫైనల్: రికార్డులు కొల్లగొట్టిన భారత్

sports |  Suryaa Desk  | Published : Fri, Feb 06, 2026, 07:49 PM

ఇంగ్లండ్‌తో జరిగిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో యువ భారత్ పలు రికార్డులను బద్దలు కొట్టింది. U19 WC ప్లేఆఫ్స్‌లో 350+ స్కోరు చేసిన తొలి జట్టుగా, U19 WC చరిత్రలో 400+ స్కోర్లను మూడుసార్లు సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. యూత్ వన్డేల్లో వైభవ్ 25 ఇన్నింగ్స్‌లలోనే 110 సిక్సులు బాది అసాధారణ రికార్డు సృష్టించాడు. ఈ టోర్నీలో అత్యధిక ఛేజింగ్ 311 పరుగులు, అఫ్గానిస్థాన్‌తో జరిగిన సెమీఫైనల్లో భారత్ ఈ రికార్డును నమోదు చేసింది.ఓవ‌రాల్‌గా సూర్య‌వంశీ 80 బంతుల్లో 175 పరుగులు న‌మోదు చేశాడు. ఇందులో 15 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి. అత‌డితో పాటు మాత్రే(53), అభిజ్ఞాన్ కుండు(40), కనిష్క్ చౌహాన్(37) రాణించారు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో జేమ్స్ మింటో మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. సెబాస్టియన్ మోర్గాన్, అలెక్స్ గ్రీన్ త‌లా రెండు వికెట్లు సాధించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa