మన వంటింట్లో మైక్రోవేవ్ ఓవెన్ వాడకం పెరిగిన తర్వాత, దానిని శుభ్రంగా ఉంచుకోవడం ఒక సవాలుగా మారింది. రకరకాల వంటకాలు చేయడం వల్ల ఓవెన్ లోపల వచ్చే వింతైన దుర్వాసనలను పోగొట్టడానికి ఒక సులువైన మార్గం ఉంది. ఒక చిన్న గిన్నెలో కొద్దిగా వెనీలా ఎసెన్స్‌ను తీసుకుని, దానిని ఓవెన్‌లో ఉంచి కొన్ని నిమిషాల పాటు వేడి చేయాలి. ఇలా చేయడం వల్ల ఓవెన్ లోపల ఉండే దుర్వాసనలు తొలగిపోయి, ఇల్లంతా మంచి సువాసనతో నిండిపోతుంది.
ఇంటిని శుభ్రం చేసే క్రమంలో కిటికీల మీద పేరుకుపోయిన మొండి దుమ్మును వదిలించడం చాలా కష్టమైన పని. దీని కోసం మార్కెట్లో దొరికే ఖరీదైన క్లీనర్ల కంటే ఇంట్లోనే తయారు చేసుకునే మిశ్రమం బాగా పనిచేస్తుంది. రెండు కప్పుల నీటిలో పావుకప్పు వెనిగర్, నాలుగు చుక్కల డిష్ వాష్ లిక్విడ్ కలిపి ఒక ద్రావణాన్ని సిద్ధం చేసుకోవాలి. ఈ నీటిలో మెత్తటి వస్త్రాన్ని ముంచి కిటికీలను తుడిస్తే, దుమ్ము పేరుకుపోకుండా అద్దాల్లా మెరిసిపోతాయి.
సాధారణంగా వంటగదిలో నూనె డబ్బాలను ఉంచే చోట లేదా ఆ డబ్బాల మీద తుప్పు మరకలు పడుతూ ఉంటాయి. ఈ తుప్పు మరకలు పడకుండా ఉండాలంటే బంగాళాదుంప ముక్కలు అద్భుతంగా పని చేస్తాయి. బంగాళాదుంపను కోసి, ఆ ముక్కలతో నూనె డబ్బాల అడుగు భాగంలో లేదా మరకలు పడే చోట రుద్దాలి. బంగాళాదుంపలో ఉండే సహజ గుణాలు తుప్పు పట్టకుండా అడ్డుకోవడమే కాకుండా, డబ్బాలను శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి.
పూజా గదిలో ఉండే వెండి వస్తువులు లేదా మనం ధరించే వెండి ఆభరణాలు కాలక్రమేణా నల్లగా గార పట్టిపోతుంటాయి. వాటి మెరుపును తిరిగి తీసుకురావడానికి పచ్చి పాలు ఒక మంచి పరిష్కారం. కొద్దిగా పచ్చి పాలను తీసుకుని వెండి వస్తువులపై వేసి మెల్లగా రుద్ది, ఆపై శుభ్రమైన నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల వెండి వస్తువుల మీద ఉన్న నలుపు పోయి, అవి కొత్త వాటిలా మెరుస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa