ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీకు ఇంకా ట్యాక్స్ 'రీఫండ్' రాలేదా,,,, కేంద్రం కీలక ప్రకటన

business |  Suryaa Desk  | Published : Tue, Feb 10, 2026, 11:13 PM

ట్యాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్. మీకు గత ఆర్థిక సంవత్సరం 2024-25కి సంబంధించిన ట్యాక్స్ రీఫండ్ ఇంకా రాలేదా? ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు ఫైల్ చేసి రీఫండ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. దాదాపు 24 లక్షల ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు లు ఇంకా ప్రాసెస్ కాకుండా పెండింగులోనే ఉన్నాయి. ఫిబ్రవరి 4, 2026 నాటి లెక్కల ప్రకారం 90 రోజులకు పైగా పెండింగ్‌లో ఉన్న ఐటీ రిటర్నులపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో కీలక ప్రకటన చేసింది. దీంతో లక్షల మంది ట్యాక్స్ పేయర్లు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు తమ రీఫండ్ నెలల తరపడి పెండింగ్‌లో ఉండడం ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొనేలా చేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.


రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ క్లారిటీ ఇచ్చింది. ఐటీఆర్ ప్రాసెసింగ్‌లో జరుగుతోన్న జాప్యానికి ఎక్కువగా ఆదాయపు పన్ను శాఖ నిర్వహించే టెక్నాలజీ ఆధారిత రిస్క్ అనాలసిస్, స్పెషల్ క్యాంపెయిన్స్ కారణంంగా తెలిపింది. కానీ, నిజాయితీపరులైన పన్ను చెల్లింపుదారులపై ఎటువంటి చేపట్టబోయే ఎలాంటి చర్యల వల్ల కాదని స్పష్టం చేసింది. ఈ అంశాన్ని రాజ్యసభ ఎంపీ దీపక్ ప్రకాశ్ లేవనెత్తారు. 2025 డిసెంబర్ చివరిలో ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌లను మూడు నుంచి నాలుగు రోజుల వ్యవధిలోపు సవరించాలని కోరుతూ పెద్ద ఎత్తున సందేశాలను పంపిందా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎలాంటి కారణాలు తెలపకుండా ట్యాక్స్ రీఫండ్స్ ఎందుకు పెండింగ్‌లో పెట్టారో చెప్పాలని కోరారు. జనవరి 31, 2026 నాటికి చాలా ఐటీఆర్స్ 90 రోజులకు పైగా ప్రాసెసింగ్ చేయకుండా పెండింగ్‌లో ఉండిపోయాని గుర్తు చేశారు.


ఆయన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు. డిసెంబర్‌లో వచ్చిన రివైజ్ యువర్ రిటర్న్స్ మెసేజుల్ ప్రధానంగా NUDGE క్యాంపియిన్‌లో భాగంగా పంపించినవిగా తెలిపారు. ఈ ప్రత్యేక క్యాంపెయిన్ ద్వారా ట్యాక్స్ పేయర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పన్నుల వివరాలు తెలిపేలా ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించినట్లు చెప్పారు. ఇందులో భాగంగానే ఎంపిక చేసిన ట్యాక్స్ పేయర్లను తమ ఐటీ రిటర్నులను సమీక్షించడం లేదా రివైజ్ చేయడం చేసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. విదేశీ ఆస్తులు లేదా విదేశీ ఆదాయం ఉండి దానిని ఐటీఆర్‌లో చూపించని వారికి, తప్పుగా లేదా అదనంగా పన్ను మినహాయింపులు, డిడక్షన్లు క్లెయిమ్ చేసిన వారికి, సెక్షన్ 80జీ, 80జీజీసీ, 80ఈ కింద తప్పుగా క్లెయిమ్ చేయడం వంటి వారికి ఈ నడ్జ్ ప్రోగ్రామ్ కింద మెసేజ్‌లో పంపించినట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa