ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేము వెనక్కి తగ్గలేదు, ఐసీసీనే దిగివచ్చింది

sports |  Suryaa Desk  | Published : Wed, Feb 11, 2026, 02:08 PM

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి, ఆ తర్వాత యూటర్న్ తీసుకున్న పాకిస్థాన్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ విషయంలో తాము వెనక్కి తగ్గలేదని, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)నే దిగివచ్చిందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ ఛైర్మన్ నజం సేథీ సంచలన వ్యాఖ్యలు చేశారు.2026 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఈ నెల 15న శ్రీలంకలోని కొలంబో వేదికగా భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మద్దతుగా ఈ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాక్ ప్రభుత్వం మొదట ప్రకటించింది. భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించడంతో, వారి స్థానంలో స్కాట్లాండ్‌ను ఐసీసీ టోర్నీలోకి తీసుకుంది. దీనిని నిరసిస్తూ పాక్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.వారం రోజుల ఉత్కంఠ తర్వాత, ఫిబ్రవరి 10న పాక్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. లాహోర్‌లో ఐసీసీ, పీసీబీ, బంగ్లాదేశ్ బోర్డు ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల ఫలితంగా, మిత్ర దేశాల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa