తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత గణనీయంగా పెరిగింది. చలి పూర్తిగా తగ్గిపోయి, ఉక్కపోతతో పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఈ ఏడాది వేసవిలో ఎండలు అధికంగా ఉండనున్నాయి. ఇప్పటికే ఫిబ్రవరి రెండో వారంలోనే గరిష్టంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే 3-5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత వేసవిలో 48 డిగ్రీల వరకు నమోదైన ఉష్ణోగ్రతలు ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం ఉందని అంచనాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.ఏటా మార్చి-ఏప్రిల్‌లో మంట పుట్టించే ఎండలు ముందే చుక్కలు చూపించాయి. ఫిబ్రవరి మొదటి వారం దాటకముందే, శివరాత్రికి శివ శివ అంటూ చలి సెలవు తీసుకోక ముందే సూర్యుడు చెలరేగి పోయాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa