ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అదానీ గ్రూప్ పై తప్పుడు ప్రచారం చేసిన జర్నలిస్టుకి కోర్టు జైలుశిక్ష

national |  Suryaa Desk  | Published : Wed, Feb 11, 2026, 02:14 PM

అదానీ గ్రూప్ పై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు, ట్వీట్లు చేసినందుకు ఓ జర్నలిస్టును కోర్టు జైలుశిక్ష విధించింది. ప్రజలు, పెట్టుబడిదారుల్లో తమ విశ్వసనీయతను దెబ్బతీసేలా కథనాలు రాశారంటూ జర్నలిస్ట్ రవి నాయర్ పై అదానీ గ్రూప్ క్రిమినల్ డిఫమేషన్ కేసు దాఖలు చేసింది. ఈ కేసు విచారించిన మాన్సా మేజిస్ట్రేట్.. రవి నాయర్ చేసిన ట్వీట్లు కేవలం విమర్శలు కావని, అవి కంపెనీ విశ్వసనీయతను దెబ్బతీసేలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ తన వాదనలను పక్కా ఆధారాలతో నిరూపించగలిగిందని కోర్టు స్పష్టం చేసింది. రవి నాయర్ ను దోషిగా తేలుస్తూ, ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa