తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఏపీలో ఈ అంశంపై అధికార పక్షం, వైసీపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ అంశంపై తాజాగా జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టంగా చెప్పారని బాలినేని అన్నారు. ఆ అంశంపై పదేపదే మాట్లాడటం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పారు. ఇంతటితో ఈ అంశాన్ని వదిలేయడం మంచిదని ఎవరైనా తప్పు చేసి ఉంటే వారి సంగతి వేంకటేశ్వరస్వామి, సీబీఐ వాళ్లు చూసుకుంటారని అన్నారు. ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ బాధ్యతలను ఎవరికి అప్పగించాలనేది తమ అధినేత పవన్ కల్యాణ్ చూసుకుంటారని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa