మీరు Apple ఐఫోన్ కొనాలనుకుంటూ, అధిక ధర కారణంగా ఇప్పటివరకు వాయిదా వేస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం కావచ్చు. ప్రస్తుతం ఐఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తూ, వేల రూపాయలు ఆదా చేసుకునే అవకాశం అందుబాటులో ఉంది.2024లో విడుదలైన iPhone 16 Plus ఇప్పుడు ఆకర్షణీయమైన డిస్కౌంట్‌తో విక్రయానికి వచ్చింది. 6.7 అంగుళాల Super Retina XDR OLED డిస్ప్లే, శక్తివంతమైన A18 చిప్‌సెట్, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వంటి ప్రీమియం ఫీచర్లతో ఈ ఫోన్ మంచి డిమాండ్ సాధించింది. అల్యూమినియం ఫ్రేమ్‌తో పాటు IP68 వాటర్ మరియు డస్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్ కూడా ఉంది. ఫోటోగ్రఫీ కోసం 48MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ లెన్స్ ఇవ్వగా, ముందు భాగంలో 12MP సెల్ఫీ కెమెరా అమర్చారు. బ్యాటరీ 27 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.ప్రస్తుతం Vijay Salesలో ఈ ఫోన్‌పై భారీ తగ్గింపు అందిస్తున్నారు. లాంచ్ సమయంలో రూ. 89,900గా ఉన్న ఈ మోడల్ ఇప్పుడు రూ. 71,890కి లభిస్తోంది. అదనంగా HDFC క్రెడిట్ కార్డు ద్వారా చెల్లిస్తే మరో రూ. 3,500 తగ్గింపు లభిస్తుంది. మొత్తంగా చూస్తే రూ. 21,000కుపైగా సేవ్ చేసుకునే అవకాశం ఉంది.ఇక మరోవైపు Google కూడా తన స్మార్ట్‌ఫోన్ ధరలను సవరించింది. కొత్త Pixel 10a ప్రీ-ఆర్డర్లు ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభం కానుండగా, ప్రస్తుత Pixel 9aపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ప్రారంభంలో రూ. 49,999 (128GB), రూ. 54,999 (256GB)గా ఉన్న ధరలు ఇప్పుడు రూ. 39,999 మరియు రూ. 44,999లకు తగ్గించబడ్డాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa