కరివేపాకు ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ నెల ప్రారంభంలో కేజీ రూ.30 ఉన్న కరివేపాకు ధర.. ప్రస్తుతం రూ.100 పలుకుతోంది. చలికాలం కారణంగా ఆకులు సరిగా రాకపోవడం, పొగమంచుకు రంగు మారడం వల్ల సరఫరా తగ్గిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. అనంతపురం, గుంటూరు జిల్లాల నుంచి దిగుమతులు అవుతున్నప్పటికీ.. రవాణా ఖర్చులతో కలిపి హోల్‌సేల్ మార్కెట్‌లో టన్ను ధర రూ.55 వేలకు పెరిగింది.రవాణా ఛార్జీలతో అనకాపల్లి చేరే సరికి కేజీకి రూ.60 పడుతోంది. వ్యాపారులు లాభం కలుపుకొని కేజీ రూ.100 చొప్పున విక్రయిస్తున్నారు. కరివేపాకు లాభదాయకమైన పంట. జిల్లాలో చాలా తక్కువ విస్తీర్ణంలో సాగవుతోంది. ఒకసారి పంట వేస్తే 15 నుంచి 20 ఏళ్లపాటు దిగుబడి వస్తుంది. మొదటి ఏడాది దిగుబడి తక్కువ వచ్చినా.. రెండో ఏడాది నుంచి నాలుగు నెలలకు ఒకసారి చొప్పున ఏడాదికి నాలుగు కోతలు వస్తాయి. ఎకరాకు ఏడాదికి 24 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. చీడపీడల సమస్య అధికంగా ఉండటం వల్ల జిల్లాలో రైతుకు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa