ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జొన్న రొట్టెలతో ఆరోగ్యం: ప్రయోజనాలు తెలుసుకోండి

Health beauty |  Suryaa Desk  | Published : Mon, Feb 16, 2026, 02:38 PM

జొన్న రొట్టెల వాడకం పెరుగుతోంది. గ్లూటెన్ రహితంగా ఉండే జొన్న రొట్టెలు జీర్ణక్రియను మెరుగుపరిచి, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తాయి. అధిక ఫైబర్ వల్ల కడుపు నిండిన భావన కలిగి, బరువు అదుపులో ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో జొన్న రొట్టెలు సహాయపడతాయి. వీటిలోని ఫైటోకెమికల్స్ శరీరంలో వాపు, మంటలను తగ్గించి, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గోధుమ రొట్టెలకు బదులుగా జొన్న రొట్టెలు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని  పోషకాహార నిపుణులు వివరిస్తున్నారు.జొన్నల్లో మినరల్స్, కాల్షియం, ఐరన్, పాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియంలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా మన రోజువారీ అవసరాలకి హెల్ప్ అవుతాయి. రెగ్యులర్‌గా తీసుకుంటే పోషకాలన్నీ మనకి అందుతాయి. జొన్న రొట్టెల్ని యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలోని టాక్సిన్స్ దూరం చేస్తాయి. అంతేకాకుండా, చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa