ప్రస్తుత ఆధునిక యుగంలో వాట్సాప్‌కు మనకూ విడదీయరాని అనుబంధం ఏర్పడింది. వ్యక్తిగత పనులకు, ఆఫీసు పనులకు ఇది అత్యవసరం అయిపోయింది. కుటుంబ సభ్యులతో సంభాషణ, స్నేహితులతో ముచ్చట్లు, ఆఫీసు పనులు వాట్సాప్‌లోనే సాగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే వాట్సాప్ ఇంతలా విజయవంతం కావడానికి కారణం నిత్యం చేస్తున్న అప్‌డేట్‌లే. ఈ ఫీచర్లు, అప్‌డేట్‌ల కారణంగా ఎప్పటికప్పుడు యూజర్లకు సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నారు. చాలా మందికి చిన్న ఫాంట్ ఉంటే సరిగ్గా కనిపించకపోవచ్చు. అయితే దీనిని వాట్సాప్ ద్వారానే పెంచుకోవచ్చు. ఇందుకు వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. ఆ తర్వాత, చాట్స్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు థీమ్, వాల్ పేపర్ ఉంటాయి. వాటి కింద చాట్ సెట్టింగ్స్ ఉంటుంది. అందులో చివరిగా ఫాంట్ సైజ్ ఆప్షన్ ఉంటుంది. దానిని క్లిక్ చేస్తే స్మాల్, మీడియం, లార్జ్ ఆప్షన్లు ఉంటాయి. మీకు ఎలా సౌకర్యంగా ఉంటే అలా దానిని మార్చుకోవచ్చు. వాట్సాప్‌లో ఉన్న సెట్టింగుల ప్రకారం టెక్స్ట్ పెద్దగా లేకుంటే, మరింత పెద్దగా ఫాంట్ మీకు కావాలంటే థర్డ్ పార్టీ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించడం వల్ల ఫాంట్ మరింతగా పెంచుకోవచ్చు. అయితే థర్డ్ పార్టీ యాప్‌లు ఎంత వరకు సురక్షితమో ఎవరూ చెప్పలేని పరిస్థితి.