వాట్సాప్ తన వినియోగదారులకు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. త్వరలోనే 32 మంది ఒకేసారి గ్రూప్ వాయిస్ కాల్ చేసుకునే ఫీచర్ ని తీసుకురానున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు 2జీబీ వరకు ఫైల్స్ షేర్ చేసుకునేలా అవకాశం కల్పించనున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం గ్రూప్ వాయిస్కాల్లో గరిష్ఠంగా 8 మంది మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది. 1 జీబీ వరకు మాత్రమే ఫైల్స్ షేర్ చేసే అవకాశం ఉండేది.ఇక గ్రూప్ అడ్మిన్ ఏ సమయంలోనైనా మెసేజ్లు డిలీట్ చేసే ఫీచర్ ను కూడా వాట్సాప్ తీసుకురానుంది. దీంతో పాటు 'కమ్యూనిటీ' అనే కొత్త ఫీచర్ ను కూడా తీసుకురానుంది. ఈ ఫీచర్ తో ఒకే రకమైన అభిప్రాయాలున్న వ్యక్తులందరూ ఒకే వేదికపై కలుసుకోవచ్చు.