ఎవరైనా ఫోన్ చేసినప్పుడు వారి నంబరును మనం ఫోన్‌లో సేవ్ చేసుకుంటే, ఫోన్ చేసిన వారి పేరు తెలుస్తుంది. లేకుంటే ట్రూ కాలర్ వంటి యాప్‌ల సాయంతో అవతలి వారి పేర్లను తెలుసుకోవచ్చు. అయితే అవి ఖచ్చితమని చెప్పలేం. ప్రముఖుల పేర్లు పెట్టుకుంటే అవి అలాగే కనిపిస్తాయి. ఈ సమస్యకు భారత టెలికమ్యూనికేషన్స్ విభాగం పరిష్కారం చూపనుంది. త్వరలో ఒక కొత్త మెకానిజం అమలు చేయనుంది. దీంతో ఎవరైనా కాల్ చేసినప్పుడు స్క్రీన్‌పై కాలర్ పేరును కనిపించేలా వీలు కల్పిస్తుంది. టెలికాం ఆపరేటర్‌ల వద్ద ఉన్న చందాదారుల నో-యువర్-కస్టమర్ (కేవైసీ) రికార్డు ప్రకారం పేరు ఉంటుంది.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) చైర్మన్ పీడీ వాఘేలా దీనిపై స్పందించారు. దీనిపై టెలికాం ఆపరేటర్లతో త్వరలో సంప్రదింపులు జరుపుతామన్నారు. మేము ఇప్పుడే ఒక సూచనను అందుకున్నామన్నారు. త్వరలో దీని పనిని ప్రారంభిస్తామన్నారు. ఎవరైనా కాల్ చేసినప్పుడు కేవైసీ ప్రకారం పేరు కనిపిస్తుందని చెప్పారు. డీఓటీ రిఫరెన్స్‌కు ముందు ట్రాయ్ ఇలాంటి మార్గాలపై ఆలోచిస్తున్నట్లు ఆయన చెప్పారు.