ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయ ముఖద్వారం నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. రాష్ట్ర పురపాలన శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తన సొంత నిధులతో ముఖ ద్వారాన్ని నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. అప్పటి నుండి నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. త్వరితగతిన పనులు పూర్తిచేసి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంచాలని మంత్రి ఆదేశాలు ఇచ్చినట్లు వారు తెలిపారు.