ఏపీలోని 38 సాధారణ, 12 మైనారిటీ గురుకుల స్కూళ్లలో 5వ తరగతిలో ప్రవేశానికి ఎంపికైన విద్యార్థులు జూన్ 20లోపు స్కూళ్లలో చేరాలని ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్.నరసింహారావు తెలిపారు. 2022-23 విద్యా సంవత్సరంలో 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన విద్యార్థుల ఎంపిక జాబితాను ఖరారు చేశామని చెప్పారు. జూన్ 20 తర్వాత మిగిలిన ఖాళీలను భర్తీ చేస్తామన్నారు.