న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు గానూ CLAT-2022 పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రాత పరీక్ష జరగనుంది. వీటిలో వచ్చే ర్యాంకుల ఆధారంగా జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో ఐదేళ్ల ఎల్ఎల్బీ(యూజీ), ఎల్ఎల్ఎం (పీజీ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. 22 జాతీయ న్యాయవిశ్వవిద్యాలయాల్లో ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బీ సీట్లు 2000, 19 వర్సిటీలలో 800ల పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి.