పాలిసెట్ 2022 ప్రవేశ పరీక్ష గురువారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 1. 30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు జవహర్లాల్ నెహ్రు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ఎ. విజయకుమార్ తెలిపారు. రామంతాపూర్ కళాశాల పరిధిలో మొత్తం 11 పరీక్ష కేంద్రాలు ఉన్నాయని, వీటిలో మొత్తం 3417 మంది విద్యార్థులు పరీక్షలకు హజరవు తున్నారని తెలిపారు. వీరిలో 1996 మంది బాలురు, 1421 మంది బాలిక లు ఉన్నారని తెలిపారు. 11 కేంద్రాలలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జిహెచ్ఎంసి సహకారంతో పూర్తిగా శాన్నిటైజ్ చేయిస్తున్నామని, అభ్యర్థులను పరీక్షించేందుకు ధర్మల్ స్కానర్లు పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రవేశ పరీక్ష నిర్వహించే కేంద్రాల వద్ద ఒక్కొ పర్యవేక్షకుడిని నియమించినట్లు తెలిపారు. పరీక్షలకు హజరయ్యే విద్యార్థులకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.