పదో తరగతి సిలబస్ పై తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యాసంవత్సరంలో 100 శాతం సిలబస్ ఉంటుందని అధికారులు తెలిపారు. విద్యార్థులకు పూర్తి సిలబస్ ను బోధించి, గతంలో మాదిరిగా 11 పేపర్లతో వార్షిక పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా 70 శాతం సిలబస్ నే అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కరోనా వ్యాప్తి తగ్గడంతో 100 శాతం సిలబస్ ను అమలు చేయనున్నారు.