డా. బీఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ మొదటి సంవత్సరంలో బీఏ, బీకాం, బీఎస్సీ మొదటి సంవత్సరంలో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు హయత్నగర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జ్యోత్స్నప్రభ, కోఆర్డినేటర్ శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్, ఏదైనా డిప్లొమా ఓకేషనల్ కోర్సులు ఉత్తీర్ణులు అ యిన వారు నేరుగా ఆన్లైన్లో ఫీజు చెల్లిం చి డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరవచ్చునని అన్నారు. డిగ్రీ ద్వితీయ, తృతీయ సం వత్సరం వార్షిక ఫీజు చెల్లించుటకు జూలై 31వరకు సమయం ఉందన్నారు. విద్యార్థులందరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.