నర్సింగ్ విద్యలో క్రిటికల్ కేర్ విభాగంలో కొత్త కోర్సును భారత నర్సింగ్ మండలి అందుబాటులోకి తీసుకొచ్చింది. దీన్ని ‘పోస్ట్ బేసిక్ డిప్లొమా ఇన్ క్రిటికల్ కేర్ స్పెషాలిటీ నర్సింగ్- రెసిడెన్సీ’గా పిలుస్తారు. ఈ కోర్సులో ఏడాది పాటు శిక్షణ ఉంటుంది.10% థియరీకి, 90% స్కిల్ ల్యాబ్, క్లినికల్ స్థాయిలో కోర్సుకు మార్కులుంటాయి. జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన వారు ఈ కోర్సుకు అర్హులు.