ఏపీలో అటవీ జంతువుల దాడులు పెరిగిపోతున్నాయి.చిత్తూరు లో ఏనుగులు, శ్రీకాకుళం లో ఎలుగుబంట్లు, కాకినాడ, అనాకపల్లి జిల్లాల్లో బెంగాల్ టైగర్ కలకలం. ఇలా రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో జంతువుల సంచారం అయితే పెరిగిపోతూ ఉంది.
అయితే ఏపీలో ఏటా ఈ జంతువుల దాడిలో ప్రతి సంవత్సరం 30 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. జాతీయ ప్రమాద మరణాల సర్వే ప్రకారం 2019లో జంతువుల దాడిలో 25 మంది చనిపోయారు ఇప్పుడు ఈ సంఖ్య 32 కు చేరుకుంది.