వైర్‌లెస్ జామర్లు, నెట్‌వర్క్ బూస్టర్ల విక్రయంపై ఈ-కామర్స్ సంస్థలకు కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. ప్రభుత్వ అనుమతి లేకుండా వీటిని విక్రయించకూడదని సోమవారం హెచ్చరికలు జారీ చేసింది. భారత్‌లో జామర్ల మార్కెటింగ్, దిగుమతి, వాణిజ్య ప్రకటనలు చేయడం, పంపిణీ చేయడం చట్ట విరుద్ధం అని స్పష్టం చేసింది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే ఆయా చట్టాల కింద నేరంగా పరిగణించనున్నట్లు తెలిపింది.