చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఒప్పో ఫోన్ల అమ్మకాలపై జర్మనీ నిషేధం విధించింది. ఇకపై జర్మనీలో ఒప్పో, వన్ప్లస్ ఫోన్ అమ్మకాలు జరపకూడదని తెలిపింది. నోకియామాబ్.నెట్ కథనం ప్రకారం నోకియా కంపెనీ పేటెంట్ హక్కులకు సంబంధించి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన మాన్హీమ్ రీజినల్ కోర్టు ఒప్పో, వన్ప్లస్పై జర్మనీలో నిషేధం విధిస్తూ తీర్పు వెలువరించినట్లు పేర్కొంది.