భారత వాట్సాప్ యూజర్స్ నకిలీ వాట్సాప్ మెస్సేజింగ్ యాప్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆ సంస్థ హెచ్చరించింది. వాట్సాప్ ఫీచర్లను పోలిన విధంగా నకిలీ, మోడిఫైడ్ వాట్సాప్ వెర్షన్లు మార్కెట్లో ఉన్నాయంటూ మెస్సేజింగ్ యాప్ సీఈవో విల్ క్యాత్ కార్ట్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. వాట్సాప్ మోడిఫైడ్ వెర్షన్ ను వినియోగిస్తే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. హే వాట్సాప్ అనే నకిలీ యాప్ ప్రమాదకరమైనదని సూచించారు.