టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ తమ ఉద్యోగులకు షాకిచ్చింది. దాదాపు 1800 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ మేరకు తమ సంస్థలో ఉన్న 1,80,000 మంది ఉద్యోగుల్లో ఒక శాతం ఉద్యోగులపై వేటు వేసినట్లు తెలుస్తోంది. వ్యాపార కార్యకలాపాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్టు పేర్కొంది. తొలగింపులున్నప్పటికీ కొత్త నియామకాలు ఉంటాయని తెలిపింది. పలు విభాగాల్లో పెట్టుబడులు పెంచుతామని ప్రకటించింది.