ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతుంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 15. 07 లక్షల క్యూసెక్కులుగా వుంది. ఈ నేపధ్యంలో స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లోని కంట్రోల్ రూమ్ నుంచి విపత్తుల శాఖ స్పెషల్ సిఎస్ జి. సాయి ప్రసాద్, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ పర్యవేక్షిస్తున్నారు. గురువారం సాయంత్రానికి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందన్నారు.