జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి భారత మార్కెట్‌లోకి సెడాన్ ఫ్లాగ్‌షిప్ ఆడి A8Lను విడుదల చేసింది. 2 వేరియంట్లలో లభించనున్న ఈ కారు.. సెలబ్రేషన్ ఎడిషన్ ధర రూ.1.29 కోట్లు, టెక్నాలజీ వేరియంట్ ధర రూ.1.57 కోట్లు. ఈ కార్లలో డైనమిక్ 3.0లీటర్ TFSI(పెట్రోల్), 48V మైల్డ్-హైబ్రిడ్ ఇంజన్ ఫీచర్లు ఉన్నాయి. 340hp పవర్‌ను, 500Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక 5.7 సెకన్లలో 0-100kmph స్పీడ్ అందుకోగలదు.