కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని పీజీ ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ తదితర కోర్సుల్లో నాలుగో సెమిస్టర్ పరీక్ష ఫీజు వివరాలను అధికారులు శుక్రవారం ప్రకటించారు. రెగ్యలర్, సప్లమెంటరీ, మార్కుల ఫీజు చెల్లించాలని తెలిపారు. ఫైన్ లేకుండా జులై 26 వరకు, రూ. 250 ఫైన్ తో, జులై 29 వరకు చెల్లించాలని పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం కళాశాలల ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని తెలిపారు.