ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో 8 ప్రమాదకర యాప్లను సైబర్ నిపుణులు తాజాగా గుర్తించారు. వి లాగ్ స్టార్ వీడియో ఎడిటర్, క్రియేటివ్ త్రీడీ లాంచర్, వావ్ బ్యూటీ కెమెరా, జిఫ్ ఎమోజీ కీబోర్డ్, ఫ్రీగ్లో కెమెరా, కోకో కెమెరా వి1.1, ఫన్నీకెమెరా బై కెల్లీ టెక్, రేజర్ కీబోర్డ్ & థీమ్ బై rxcheldiolola యాప్లను వెంటనే అన్ఇన్స్టాల్ చేసుకోవాలని వారు హెచ్చరిస్తున్నారు. వీటిని ఇప్పటికే గూగుల్ తొలగించింది.