బట్టలు ఉతకడాన్ని సులభం చేసేందుకు ఒకప్పుడు వాషింగ్మిషిన్లను తయారుచేసారు. ఇప్పుడు నీళ్లు, డిటర్జెంట్ లను పొదుపు చేసేందుకు చండీగఢ్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ 80వాష్ కొత్త రకం వాషింగ్‌మిషిన్ ను తయారుచేసింది. కేవలం 80 సెకన్లలో సబ్బు అవసరం లేకుండా ఒకే ఒక కప్పు నీటితో ఐదు దుస్తులను ఉతికేస్తుంది. స్టీమ్ టెక్నాలజీ ఆధారంగా మైక్రోవేవ్ పరిజ్ఞానం సాయంతో దుస్తులపై మరకలను, బ్యాక్టీరియాను పోగొడుతుంది.