తెలంగాణలో ఈసెట్ పరీక్షలు సోమవారం జరగనున్నాయి. పాలిటెక్నిక్, బీఎస్సీ మాథ్స్ కోర్సులు పూర్తిచేసిన వారికి నేరుగా బీటెక్ సెకండియర్‌లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఉదయం 9 గం. నుంచి మ. 12 గంటల వరకు కంప్యూటర్ సైన్స్, ఈఈఈ, ఈసీఈ, ఈఐఈ అభ్యర్థులకు, మధ్యాహ్నం 3 గం. నుంచి సా. 6 గంటల వరకు సివిల్, మెకానికల్, కెమికల్, మైనింగ్, మెటలర్జీ, ఫార్మసీ, బీఎస్సీ గణితం అభ్యర్థులకు పరీక్ష జరగనుంది.