పశ్చిమ బెంగాల్ లో ఆదివారం అర్ధరాత్రి కరెంట్ షాక్ తో 10 మంది మృతిచెందారు. సీతల్ కుచి పీఎస్ పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన 27 మంది వ్యాన్లో జల్పేశ్ కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆదివారం రాత్రి ఒక్కసారిగా వ్యాన్ అంతటా విద్యుత్ సరఫరా అయ్యింది. కరెంట్ షాక్ తో 10 మంది చనిపోగా, 16 మంది గాయపడ్డారు. వ్యాన్ వెనుక ఉన్న డీజే సిస్టమ్ జనరేటర్ వైరింగ్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.