జేఈఈ మెయిన్-2022 సెషన్ 2 ఫలితాలను సోమవారం ఎన్‌టీఏ విడుదల చేసింది. విద్యార్థులు ఫలితాల కోసం jeemain.nta.nic.in 2022 లేదా ntaresults.nic.in 2022 వెబ్‌సైట్‌లను సందర్శించాలని ఎన్‌టీఏ సూచించింది. ఫలితాలను తెలుసుకునేందుకు అభ్యర్థులు వారి దరఖాస్తు సంఖ్య, పుట్టిన తేదీని నమోదు చేయాలి. ఆ తర్వాత అభ్యర్థి పేరు, ర్యాంక్, సబ్జెక్టుల వారీగా స్కోర్, పర్సంటైల్ మార్కులు, వ్యక్తిగత వివరాలు కనిపిస్తాయి.