మేషం
అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. మధ్యలో నిలిచిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను దైర్యంగా పరిష్కరించుకుంటారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
వృషభం
వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆప్తులతో వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.
మిధునం
నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో పెద్దల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.నూతన ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి.
కర్కాటకం
ఆర్ధిక అనుకూలత కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. సమాజంలో పరిచయాలు విస్తృతమౌతాయి. స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలు అధిగమిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగస్తుల జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.
సింహం
కొన్ని వ్యవహారాలు మధ్యలో నిలిచిపోతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. వ్యాపారాలలో ద్విస్వభావ ఆలోచనలు చేసి ఇబ్బంది పడతారు.
కన్య
వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. దూరపు బంధువుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. నూతన ఋణ యత్నాలు కొంత కష్టంతో పూర్తి అవుతాయి. వృత్తి ఉద్యోగాలు కొంత సామాన్యంగా లాభిస్తాయి. బందు మిత్రులతో మాటపట్టింపులుంటాయి.
తుల
భూ క్రయవిక్రయాలలో విశేషమైన లాభాలు అందుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కుటుంబ పెద్దలతో సఖ్యతగా వ్యవహరిస్తారు. చేపట్టిన పనిలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. బంధు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.
వృశ్చికం
దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. వృత్తి ఉద్యోగ విషయంలో ఉన్న సమస్యలు అధిగమిస్తారు. ఆప్తులతో దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు.
ధనస్సు
ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. సంతాన విద్యా విషయాలు నిరాశపరుస్తాయి. వృత్తి ఉద్యోగాలు ఊహించని సమస్యలు కలుగుతాయి.
మకరం
ఋణ దాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. బంధువుల నుండి అందిన ఒక వార్త నిరుత్సాహం కలిగిస్తుంది. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపార ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు.
కుంభం
ఆత్మీయులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు కుదురుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మిత్రుల సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
మీనం
సంతాన ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకోవడంలో విఫలమౌతారు. ఋణ దాతలు నుండి ఒత్తిడి పెరుగుతుంది.