బుక్కపట్నం: పాముదుర్తి గ్రామాన్ని సందర్శించి గ్రామంలో పీర్ల పండగను ప్రశాంతంగా జరుపుకోవాలని సోమవారం పుట్టపర్తి రూరల్ సీఐ జయా నాయక్ పేర్కోన్నారు. గొడవలు పడితే వారిపై కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని, గొడవ పడితే రాబోవు రోజుల్లో పండుగ వేడుకలకు పర్మిషన్ ఇవ్వమన్నారు. అదే విధంగా గ్రామంలో జూదం, మట్కా మరియు లిక్కర్ అమ్మడం వంటి అక్రమ కార్యకలాపాలు జరిగితే సమాచారం ఇవ్వాలన్నారు.