మా పార్టీ లీడర్ల పరామర్శలకు మా నేతలు వెళ్తుంటే కూడా సీఎం ఎందుకు ఇంత తీవ్రంగా భయపడుతున్నాడు? అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... శ్రీకాకుళంలో టీడీపీ నేతల అరెస్టులు ఎందుకో, ఆంక్షలు ఎవరి కోసమో ఈ ప్రభుత్వం చెప్పాలి? అర్ధరాత్రి కూల్చివేతలు, అక్రమ కేసులపై ప్రజల ప్రశ్నలను మీ ఈ అరెస్టులు అడ్డుకోలేవు.
పరామర్శకు వెళ్ళకూడదు అని ఏ చట్టం చెపుతుంది? పలాసలో రాజకీయ కక్ష లతో తప్పు చేశారు కాబట్టే ప్రభుత్వం ఈ స్థాయిలో వణికిపోతుంది. మీరు వైసీపీ పోలీస్ కాదు....ఆంధ్రప్రదేశ్ పోలీస్ అని గుర్తు పెట్టుకుంటేనే గౌరవం అని హితవు పలికారు.