ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అన్యాయాలు,అక్రమాల పై పోరాడితే అక్రమ అరెస్టులు,పరామర్శలకు వెళ్తే పోలీసులతో దౌర్జన్యాలు చేయటం పరిపాటిగా మారింది అని పల్నాడు జిల్లా, నరసరావుపేట టీడీపీ ఇంచార్జి చదలవాడ అరవింద్ బాబు తెలియజేసారు. అయన మాట్లాడుతూ... ఈ ఘటనలు చూస్తుంటే ఈ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగంతో పాటు,పక్కాగా ఎమర్జెన్సీని తలపిస్తుంది. నరసరావుపేట పట్టణంలో స్థానిక ఇస్లాంపేట నందు బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించి, ఈ కార్యక్రమానికి పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.