శ్రీకాకుళం కొత్త జంక్షన్ దగ్గర నారా లోకేష్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు. ఆయనతో పాటు పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తల అరెస్ట్. ఇది ప్రజాస్వామ్య విరుద్ధం.అని టీడీపీ నాయకులూ ఆరోపిస్తున్నారు. దీనిపై స్పందించిన లోకేష్ మాట్లాడుతూ... జేసిబిలు పంపి పేదలు, టిడిపి నేతల ఇళ్లు కూల్చడంతో జగన్ రెడ్డి గారి, వైసిపి నేతల ఫ్యాక్షన్ బుద్ధి మరోసారి బయటపడింది. కనీసం పరామర్శకు వెళ్ళడానికి కూడా వీలు లేదని పోలీసులు పౌరుల హక్కులు కాలరాసే విధంగా వ్యవహరించడం దుర్మార్గం.
పలాసలో జరుగుతున్న విధ్వంసకాండకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాం. నన్ను అరెస్ట్ చేయించి ఊరంతా తిప్పి జగన్ రెడ్డి గారు సైకో ఆనందం పొందుతున్నారు. నా పర్యటనను అడ్డుకోవడానికి పెట్టిన శ్రమ అభివృద్ధిపైనా, శాంతిభద్రతలు కాపాడటంపైనా పెడితే పరిస్థితులు కాస్తయినా మెరుగుపడతాయి సీఎం గారూ అని తెలియజేసారు.