యూపీలోని బృందావన్‌లో ఐఏఎస్ అధికారి, మధుర డీఎం నవనీత్ చాహల్‌కు ఓ కోతి ఇటీవల షాకిచ్చింది. ఆమె గాజులు, కళ్లద్దాలు లాక్కుని పరారైంది. ఈ విషయం తెలిసిన పోలీసులు ఆ కోతి వెంటపడ్డారు. కోతి నుంచి ఆ గాజులు, కళ్లద్దాలు తీసుకోవడానికి నానా కష్టాలు పడ్డారు. ఎట్టకేలకు ఆ కోతి గాజులు, కళ్లద్దాలు ఇచ్చేయడంతో పోలీసులు ఊరట చెందారు. వాటిని పోగొట్టుకున్న ఐఏఎస్ అధికారికి అవి అందజేశారు.