పలాస పర్యటనకు వెళ్లిన టీడీపీ నేతలను నిర్బంధించడంపై ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. పరామర్శించడానికి వెళ్తున్నా జగన్ భయపడుతున్నారని అన్నారు. శ్రీకాకుళంలో టీడీపీ నేతల అరెస్టులు, ఆంక్షలు ఎవరి కోసమే ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు. పలాసలో రాజకీయ కక్షతో తప్పులు చేశారు కాబట్టే జగన్ ప్రభుత్వం ఇలా వణికిపోతోందని అన్నారు.