ఏపీలోని కర్నూలు జిల్లా కోడుమూరులో సోమవారం రాత్రి దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో కృష్ణ అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఆటోలో పరారయ్యాడు. పాలకుర్తి వద్ద ఆటోతో సహా పిల్లలను కాలువలో పడేసి వెళ్లిపోయాడు. కాలువలో నీరు లేకపోవడంతో చిన్నారులకు ప్రమాదం తప్పింది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని, చిన్నారులను కాపాడారు. నిందితుడు కృష్ణ కోసం పోలీసులు గాలిస్తున్నారు.