ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వాన్ని నిరసిస్తూ బిహార్‌లోని ఉద్యోగార్థులు సోమవారం రోడ్డెక్కారు.త్వరగా నియామక ఉత్తర్వులు జారీ చేయాలంటూ పట్నాలో నిరసనకు దిగారు. అయితే, కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తుండగా వారిపై జిల్లా అదనపు మెజిస్ట్రేట్ కేకే సింగ్ తన ప్రతాపాన్ని చూపించారు. మీడియాతో మాట్లాడుతున్న ఓ అభ్యర్థిని బలవంతంగా పక్కకు లాగి చితకబాదారు.జాతీయ జెండాను అడ్డుపెట్టినా కనికరించలేదు.