కర్ణాటకలోని తుమకూరులో జులై 2న జరిగిన హత్యకేసును పోలీసులు చేధించారు. రాయచూరుకు చెందిన లక్ష్మి రెండవ భర్తతో విడాకులు తీసుకుంది. ఇటీవల దొడ్డలింగప్ప, వెంకటేష్ అనే ఇద్దరితో, ఒకరికి తెలియకుండా మరొకరితో ఆమె ఎఫైర్ పెట్టుకుంది. వీరంతా ఒకే చోట పని చేసేవారు. జులై 2న రెండవ ప్రియుడు వెంకటేష్‌తో కలిసి దొడ్డలింగప్పను ఆమె చంపేసింది. పోలీసులు నిందితులిద్దరినీ తాజాగా అరెస్ట్ చేశారు.