ఢిల్లీలో 8 బాలిక హత్యాచారం కేసును పోలీసులు ఛేదించారు. బీహార్ నుంచి ఢిల్లీకి వలస వచ్చిన రిజ్వాన్ అనే వ్యక్తి స్థానికంగా ఓ మహిళతో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఓ రోజు వారిద్దరూ ఏకాంతంగా ఉండగా, మహిళ కుమార్తె చూసింది. తమ ఎఫైర్ బయటపడుతుందనే భయంతో ఆ బాలికను ఆగస్టు 5న కిడ్నాప్ చేశాడు. ఆపై అత్యాచారం చేసి చంపేశాడు. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో నేరం ఒప్పుకున్నాడు. దీంతో మంగళవారం అతడిని అరెస్ట్ చేశారు.