బెంగళూరులోని చామరాజ్ పేటకు చెందిన దంపతులకు ముగ్గురు పిల్లలు. తండ్రి పెయింటర్, తల్లి గృహిణి. కాగా, బాలిక(9) 5వ తరగతి చదువుతుంది. స్కూల్‌లో పేరెంట్ మీటింగ్‌కు హాజరై ఇంటికి తిరిగొస్తున్న క్రమంలో తండ్రిని షాపింగ్‌కు తీసుకెళ్లమని కోరింది. కానీ, తల్లిదండ్రులు ఇద్దరు చిన్నపిల్లలను తీసుకుని షాపింగ్‌కు వెళ్లారు. ఆ బాలికను ఇంటివద్దనే ఉంచారు. దీంతో మనస్థాపానికి గురైన బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.