గరుగుబిల్లి మండలం రావివలస లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంను ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి చేపట్టారు. ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను, మూడేళ్లలో ఒక్కోక కుటుంబానికి ప్రభుత్వం చేకూర్చిన లబ్ధిని వివరించారు. ప్రజలు పసుపు, కుంకుమలతో వారికి ఘన స్వాగతం పలికారు. అమ్మఒడి, చేయూత మంజూరు చేయడంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు పూలమాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ప్రతి గడప గడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పి వైస్ చైర్మన్ బాపూజీ నాయుడు , వైసిపి నాయకులు పాల్గొన్నారు.