ఏపీలో వినాయక చవితి పందిర్లకు ప్రభుత్వం పన్ను వసూలు చేయడం దారుణమని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. విజయవాడలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఒక్కో పందిరికి రోజుకు రూ.వెయ్యి చొప్పున ప్రభుత్వం వసూలు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. హిందువులపై సీఎం జగన్ క్షక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పండగలపై ప్రభుత్వ పెత్తనం చేయడమేంటని ప్రశ్నించారు.