దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 257.43 పాయింట్ల లాభంతో 59,031.30 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 86.80 పాయింట్ల లాభంతో 17,577.50 వద్ద ముగిసింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.79.87 గా ఉంది. బజాజ్ ఫిన్ సర్వ్, టాటా స్టీల్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు, మారుతీ, ఎయిర్ టెల్, నెస్లే, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు, టైటాన్, ఎంఅండ్ఎం షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.