విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు విద్యార్థినిలు కళాశాల బహిష్కరణ చేసి ధర్నా నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి పోలీసులు కళాశాల చుట్టుముట్టి విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఎస్.ఎఫ్.ఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్.ఎఫ్.ఐ నాయకులు సరేంద్ర రామన్న మాట్లాడుతూ. జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత విద్యారంగంలో కూడా పోలీసులను ప్రవేశించి ఉద్యమాలు అణచివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సమస్యలను పరిష్కారం చేయకుండా పోలీసులు పెట్టి ఉద్యమాలను అణచివేయాలని ఉగ్రవాదులగా విద్యార్థులు చుట్టూ పోలీసులు పెట్టిన జగన్ ప్రభుత్వంపై ఖండిస్తున్నామన్నారు.