సైబర్ నేరగాళ్ల వలలో ఏపీలోని అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ రిటైర్డ్ టీచర్ చిక్కుకున్నారు. ఏకంగా రూ.21 లక్షలను ఆమె బ్యాంకు ఖాతా నుంచి కేటుగాళ్లు కొట్టేశారు. బాధితురాలు వరలక్ష్మి వాట్సాప్కు సోమవారం గుర్తు తెలియని నంబరు నుంచి ఓ మెసేజ్ వచ్చింది. దానిని క్లిక్ చేయగానే దఫదఫాలుగా ఆమె ఖాతా నుంచి డబ్బు మాయమైంది. దీనిపై పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది.